Sunday, January 5, 2025

తెలంగాణలో రూ.10 లక్షల కోట్లతో అభివృద్ధి పనులు: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: కొత్త రైలు మార్గాలు, విద్యుద్దీకరణ, రైల్వే స్టేషన్లలో ఆధునీకరణ జరిగిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బిజెపి విజయ సంకల్ప సభలో కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణలో 40 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులు కేంద్రం చేపట్టిందని స్పష్టం చేశారు. తెలంగాణలో కేంద్రం ఇప్పటివరకు పది లక్షల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిందని తెలియజేశారు. కేంద్రం తెలంగాణకు ఏమీ ఇవ్వటం లేదని కొందరు ఆరోపణలు చేయడం మంచిది కాదని కిషన్ రెడ్డి హితువు పలికారు. బిఆర్‌ఎస్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, మార్పు వస్తుందనే ఆలోచనలో ప్రజలు ఉన్నారని, తెలంగాణలో ఏ రకమైన మార్పు కనిపించడంలేదని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. కెసిఆర్ కుటుంబం తెలంగాణను దోపిడీ చేసిందని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ ట్యాక్స్ పేరుతో వసూళ్లు చేపట్టారని, ఎంపి ఎన్నికల కోసం బిల్డర్లు, కాంట్రాక్టర్ల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు. బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల డిఎన్‌ఎ ఒక్కటేనని, రెండు పార్టీలకు ఎంఐఎం జత కలిసిందని, కాంగ్రెస్, బిఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు తెలంగాణ తెలంగాణ ప్రజలను దోచుకుతిన్నాయని కిషన్ రెడ్డి విమర్శించారు. నిజమైన మార్పు కోసం కుటుంబ పార్టీలకు చరమగీతం పాడాలని సూచించారు. బిఆర్‌ఎస్ కెటిఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలని చూసిందని, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని చూస్తోందని ధ్వజమెత్తారు. బిజెపి ఒక్కటే ప్రజల కోసం పని చేసే పార్టీ అని, మరోసారి మోడీ హ్యాట్రిక్ ప్రధాని కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈ సభలో ప్రధాని నరేంద్ర మోడీ, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, తెలంగాణ బిజెపి ఎంఎల్‌ఎలు, తదితరలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News