Wednesday, November 6, 2024

నగరంలో మరిన్ని అభివృద్ధి పనులకు ముహుర్తం ఖరారు

- Advertisement -
- Advertisement -
More development works in Hyderabad
ఈ నెల 12న ప్రారంభించనున్న మంత్రి కెటిఆర్:  మంత్రి తలసాని

హైదరాబాద్: నగరంలో మరిన్ని అభివృద్ధి పనులు ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12వ తేదీన పురపాలక శాఖమంత్రి కె.తారక రామారావు చేతుల మీదగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం వెల్లడించారు. మాసాబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో జిహెచ్‌ఎంసి, ఎస్‌ఎన్‌డిపి, టౌన్ ప్లానింగ్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమిక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలో దాదాపుగా రూ.61 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ది పనులను ఈనెల 12వ తేదీన మంత్రి కెటిఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. దశాబ్దాల కాలంగా నాలా పరిసర ప్రాంత ప్రజలు పడుతున్నఇబ్బందులను మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ దృష్టికి తీసుకువెళ్లిన మరుక్షణమే రూ.45 కోట్లను మంజూరు చేశారన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ ప్రజల తరుపున మంత్రి కెటిఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

ఈ నెల 12 న ఉదయం 9 గంటలకు ఎస్‌పి రోడ్ లోని ఖరాచి బేకరీ వద్ద పికెట్ నాలాపై రూ.10 కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జి పనులను మంత్రి కెటిఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం పాటిగడ్డలో రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మల్టిపర్ఫస్ పంక్షన్ హాల్ పనులను గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డితో కలిసి మంత్రి కెటిఆర్ ప్రారంభించనున్నరన్నారు. అదేవిధంగా రూ.45 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బేగంపేట్ నాలా అభివృద్ది పనులకు ప్రకాశ్ నగర్, అల్లంతోట బావి ప్రాంతాల్లో మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేస్తారనివెల్లడించారు. ఈ నిధులతో నాలాకు రిటైనింగ్ వాల్స్, పైపు లైన్లు, రోడ్ల నిర్మాణ చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ పనులు పూరైతే బేగంపేట నాలాకు ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరదనీటితో బ్రాహ్మణ వాడి, అల్లంతోటబావి, వడ్డెరబస్తీ, మాతాజీనగర్, ప్రకాశ్ నగర్, ప్రాంతా వాసులకు వరదనీటి ముంపు నుంచి శాశ్వత పరిష్కారం లభించనుందన్నారు. ప్రారంభోత్స కార్యక్రమాల తర్వాత మంత్రి కెటిఆర్ బుద్దబవన్‌లో మంత్రి కెటిఆర్ జిహెచ్‌ఎంసి, వాటర్ వర్క్, ఎలక్ట్రిసిటీ, హౌసింగ్ రెవెన్యూ రైల్వే తదితర శాఖలతో సనత్ నగర్ నియోజకర్గంలో జరుగుతున్న అభివృద్ది పనులు, భవిష్యత్‌లో చేపట్టాల్సి పనులపై సమిక్షా సమావేశం నిర్వహిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News