- Advertisement -
మేడ్చల్: కార్తీక మాసం సందర్భంగా కీసరగుట్టకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. 2023 నవంబర్ 14వ తేదీ మంగళవారం కార్తీకమాసం తొలి రోజు కావడంతో కీసరగుట్టలోని శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణంలో భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు ఏర్పాటు చేశామని చైర్మన్ తటాకం రమేష్ శర్మ పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలిగిన తన కార్యాలయంలో తెలియజేయాలని చైర్మన్ తెలిపారు. కార్తీక మాసం అంటే శివుడికి ఇష్టమైన మాసం అని ఆలయ ప్రధాన అర్చకులు బలరాం శర్మ పేర్కొన్నారు. లింగంపై నీళ్లతో అభిషేకం చేయడంతోపాటు నాలుగు సోమవారాలు ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆలయ ఆవరణంలో దీపాలు వెలిగిస్తే మంచి జరుగుతుందని పేర్కొన్నారు.
- Advertisement -