మహాకుంభ్ నగర్(యూపి) : పవిత్ర మౌని అమావాస్య జనవరి 29న రానున్నది. ఈ సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తుతున్నారు. వారంతా త్రివేణి సంగంలో పుణ్య స్నానం చేయడానికి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తున్నారని అధికారులు తెలిపారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, హైవేలు భక్త జనకోటితో కిటకిటలాడుతున్నాయి. శుక్ర, శనివారాల్లో 1.25 కోట్లకు పైగా భక్తులు సంగంలో పుణ్యస్నానం చేశారు. మౌని అమావాస్యనాడు త్రివేణి సంగంలో పుణ్యస్నానానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నందున ఆ సంఖ్య 10 కోట్లకు పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు.
భక్తుల కోసం అధికారులు, పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మొత్తం కుంభమేళా ప్రాంతాన్ని ‘నో వెహికిల్ జోన్’గా ప్రకటించారు. భక్తులు సులభంగా రాకపోకలు సాగించేందుకు బారికేడ్లను ఏర్పాటు చేశారు. అన్ని సెక్టార్లలో, జోన్లలో భక్తుల రాకపోకలు సులభతరం అయ్యేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ‘అమృత్ స్నాన్’ సందర్భంగా ప్రజల సౌకర్యార్థం ‘నో స్పెషల్ ప్రొటోకాల్ ’ అమలుచేయనున్నారు. పోటెత్తుతున్న జనసంద్రాన్ని నియంత్రించేందుకు ‘ది ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్’(ఐసిసిసి)ని యాక్టివేట్ చేశారు.
సంగం నోస్ వద్ద అత్యధిక జన కూటమి పోగవ్వకుండా జనాన్ని నియంత్రిస్తున్నారు. అత్యవసరపరిస్థితిని నియంత్రించేందుకు ‘క్విక్ రెస్పాన్స్ టీమ్స్’ను మోహరించారు. అ నుమాన వ్యక్తులను ట్రాక్ చేయడానికి నిఘా కూడా పెట్టారు. కుంభమేళా ప్రాంతాన్ని అక్రమంగా ఆక్రమించిన దుకాణాలకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ కూడా చేపట్టారు. వాహనాలను పార్కింగ్ జోన్ల వద్దకు పంపుతున్నారు. భక్తులకు మార్గనిర్దేశన చేయడానికి 2000కు పైగా ‘సైనేజెస్’ ఏర్పాటుచేశారు.కుంభమేళా అధికారిక చాట్‌బాట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవలసిందిగా భక్తులను ప్రోత్సహిస్తున్నారు. సరైన రూట్ తెలుసుకునేందుకు చాట్‌బాట్‌కు అదనంగా గూగుల్ నేవిగేషన్, పోలీసుల సాయం కూడా భక్తులకు అందిస్తున్నారు.