Wednesday, January 22, 2025

మేడారంలో పెరుగుతున్న రద్దీ

- Advertisement -
- Advertisement -

More devotees in Medaram Jatara

మన తెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి : మేడారం జాతరకు గురువారం లక్షలాది మంది భక్తులు వచ్చి సమ్మక్క సారక్కలను అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన మేడారం జాతరకు రాష్ట్ర నలుమూలల నుంచి వాహనాల్లో బస్సులో భక్తులు ప్రయాణం చేసి సమ్మక్క సారక్క దర్శించుకుంటున్నారు. వచ్చిన భక్తులకు ఇప్పటికి పనులు పూర్తి కాకపోవడంతో భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో జరిగే అతిపెద్ద జాతర ఏలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు సురక్షితంగా దర్శించుకుని పోవాలని 75 కోట్లతో నిధులు కేటాయించి అభివృద్ది పనులు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. కానీ పనులు నత్త నడకన జరగడం వలన భక్తులకు ఇబ్బందులు కలుగుతాయని , ఇక జాతర ఎన్ని రోజులు లేదని , పనులు మాత్రం పూర్తికాక పోవడం వలన భక్తులు పడుతున్నారని అన్నారు. ఇప్పటికైన వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించే విధంగా అధికరాఉలు పనులు చేపట్టాలని భక్తులు అంటున్నారు. రోజు రోజుకి సమ్మక్క సారక్క దర్శించుకునేందుకు భక్తుల రద్దీ పెరుగుతోందని, అధికారులు వెంటనే అభివృద్ది పనులు చేపట్టాలని భక్తులు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News