Tuesday, February 11, 2025

ప్రయాగ్ రాజ్ లో కొనసాగుతున్న భక్తుల రద్దీ

- Advertisement -
- Advertisement -

లక్నో: ప్రయాగ్‌రాజ్‌లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. త్రివేణి సంగమంలో భక్తుల పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఇప్పటివరకు 44 కోట్ల మంది భక్తుల పుణ్యస్నానాలు చేశారు. ప్రయాగ్‌రాజ్‌ వెళ్లే మార్గాల్లో వాహనాల రద్దీ కొనసాగుతోంది. జబల్‌పుర్‌-ప్రయాగ్‌రాజ్‌ మార్గంలో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలు నిలిచిపోయాయి. కాశీ, అయోధ్యలకు భక్తులు పోటెత్తుతున్నారు.  కాశీలో పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. రెండు రోజుల పాటు ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లొద్దని యుపి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మధ్యప్రదేశ్‌ సిఎం మోహన్‌యాదవ్ పలు సూచనలు చేశారు. ఈనెల 26తో మహా కుంభమేళా ముగియనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News