Sunday, December 22, 2024

శబరిమలలో ఇసుకేస్తే రాలనంత భక్తుల రద్దీ….

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. శబరిమలలో భక్తుల రద్దీ పెరగడంతో నాలుగు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పలువురు భక్తులు వాహనాలను వదిలేసి ఎరుమేలి నుంచి శబరిమలకు పాదయాత్రగా వెళ్తున్నారు. భక్తులు భారీ సంఖ్యలో రావడంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసింది. కొందరు భక్తుల స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి 24 గంటల నుంచి 36 గంటల సమయం పడుతుండడంతో వెనుదిరుగుతున్నారు. స్వామి మాలధారణలో ఉన్న చిన్నారులు సైతం నానా ఇబ్బందులు పడుతున్నారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తుండడంతో అటవీ మార్గంలో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు అటవీ శాఖ అధికారులు అనుమతి ఇస్తున్నారు. ఎరుమేలి నుంచి పంపా వరకు అటవీ గుండా ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News