- Advertisement -
అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం 26 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడింది. బుధవారం 71,123 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,689 మంది భక్తులు తలానీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.84 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.
- Advertisement -