Sunday, February 23, 2025

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్నీ నిండిపోవడంతో వెలుపల ఆక్టోపస్ భవనం వరకు క్యూలైన్‌లో భక్తులు వేచివున్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శ్రీవారి ప్రత్యేక దర్శానికి ఐదు గంటల సమయం పడుతోంది. శనివారం శ్రీవారిని 70,686 మంది భక్తులు దర్శించుకున్నారు. 34563 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.02 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News