- Advertisement -
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 12 గంటల సమయం పడుతోంది. శ్రీవారు సర్వ దర్శనానికి భక్తులు 21 కంపార్టుమెంట్లలో వేచి వున్నారు. సోమవారం శ్రీవారిని 67,198 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,542 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.19 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.
- Advertisement -