శ్రీలక్ష్మీనరసింహుని దర్శనానాకి పోటెత్తిన భక్తులు
ఆలయ నిత్యరాబడి 58.58 లక్షలు
మనతెలంగాణ/యాదాద్రి: తెలంగాణ ప్రసిద్ది క్షేత్రం యాదాద్రికి తరలి వచ్చిన ఆశేష భక్తలతో భక్తజన మహోత్సవంగా యాదగిరికొండ నెలకొంది. రెండు రోజులు వరస సేలవుల తోపాటూ వేసవి సెలవులు కూడ రావడంతో ఆదివారం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుని దర్శనార్ధం భక్తజనులు పోటెత్తారు. యాదాద్రి వాసుని దర్శనానికి వివిధ ప్రాంతాలనుండి భక్తులు రావడంతో ఆలయ ప్రాతం భక్తులతో కిటకిటలాడింది.శ్రీ స్వామి వారి దర్శనార్ధం భక్తులు కుటుంభ సభ్యులతో కలిసి యాదాద్రికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. తెల్లవారు జామున 3.30 గంటలకు ఆలయం తెరిచిన అర్చక స్వాములు సుప్రభాత సేవ నిర్వహించారు.
Also Read: నిరంజన్ రెడ్డి సవాల్ పై స్పందించిన రఘునందన్
శ్రీవారి దర్శనానికి తెల్లవారుజాము నుంచి ఆలయం చేరుకున్న భక్తులు శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శంచుకొని ఆలయ నిత్యపూజలు అభిషేకం,అర్చన, సుదర్శన నారసింహ హోమం, నిత్యకల్యాణం, సువర్ణ పుష్పర్చన, వేండి జోడి సేవ, శ్రీత్యనారాయణ వత్రపూజలలో భక్తులు పాల్గొని తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శంచుకున్న భక్తులకు సుమారు 3 గంటలకు పైగా సమయం పట్టింది. శ్రీలక్ష్మీనరసింహుని దర్శించుకున్న భక్తజనులు కొండపైన కొలువుదీరిన శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి శివాలయంలో భక్తులు శివదర్శనముతో పాటు కొండ కింద శ్రీ పాతలక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో దర్శించుకొని ఆలయ నిత్యపూజలలో భక్తులు పాల్గొన్నారు.
ఆలయ నిత్యరాబడి…
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానము ఆలయ నిత్యరాబడిలో భాగంగా ఆదివారం 58,58,934 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రసాద విక్రయం ద్వార 23,04,100, కొండపైకి వాహన అనుమతితో 6,50,000, ప్రధాన బుకంగ్ ద్వార, 8,06,450 విఐపి దర్శనము ద్వార 5,40,000 బ్రేక్ దర్శనముతో 4,85,400 వ్రతపూజలతో 2,25,800 తోపాటూ పలు శాఖలు, పాతగుట్ట ఆలయం నుండి నిత్యరాబడి సమకూరినట్లు తెలిపారు.