Monday, December 23, 2024

హైదరాబాద్ ప్రజలకు టిఎస్ ఆర్టీసి గుడ్‌న్యూస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హైదరాబాద్ ప్రజలకు టిఎస్ ఆర్టీసి గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌తో పాటు విజయవాడకు ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతుండగా ఈ మార్గంలో త్వరలో మరిన్ని బస్సులను నడపాలని నిర్ణయించింది. అందులో భాగంగా వచ్చే నెల నుంచి జీహెచ్‌ఎంసి పరిధిలో ఎలక్ట్రిక్ బస్సులను తిప్పేందుకు కసరత్తులు చేస్తోంది. ఏయే మార్గాల్లో ఎలక్ట్రిక్ బస్సులను తిప్పాలన్న దానిపై ప్రజల నుంచి ఇప్పటికే ఆర్టీసి అభిప్రాయాలు తీసుకుంటోంది.

ఏయే రూట్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది..? ఏయే మార్గాల్లో నడిపితే సంస్థకు ఆదాయం రావడంతో పాటు ప్రజలకు ఉపయో కరంగా ఉంటుందన్న దానిపై ఆన్‌లైన్ సర్వేను ఆర్టీసి నిర్వహిస్తోంది. ప్రజల నుంచి వచ్చే అభిప్రాయాల ప్రకారం ఏయే రూట్లో నడపాలన్న దానిపై త్వరలో ఆర్టీసి అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల్లో ఆధునిక సౌకర్యాలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. 35 సీట్లు బస్సులో అందుబాటులో ఉండనుండగా మొబైల్ ఛార్జీంగ్‌తో పాటు ప్రయాణికుల భద్రత కోసం సిసి కెమె రాలను ఏర్పాటు చేయనున్నారు.

అలాగే బస్టాఫుల వివరాలను ఎల్‌ఈడీ బోర్డులలో ప్రదర్శించనున్నారు. ఈ బస్సులకు ఒక్కసారి చార్జీంగ్ చేస్తే 225 కిలోమీటర్ల వరకు నడుస్తాయి. ఫుల్‌ఛార్జ్ అవ్వడానికి రెండు గంటల సమయం పడుతుంది. అలాగే ప్రతి సీటు దగ్గర పానిక్ బటన్‌తో పాటు వెహికల్ ట్రాకింగ్ సిస్టం కూడా ఉంటుంది. అలాగే ఈ బస్సుల్లో సీటు బెల్ట్ సదుపాయం కూడా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు కోసం ఇప్పటికే ఒలెక్ట్రా కంపెనీతో ఆర్టీసి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 500 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలని ఆర్టీసి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే నెలలో 25 బస్సులు హైదరాబాద్ రోడ్లపై తిరగనున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News