Monday, December 23, 2024

విద్యాలయాల్లో డిజిటల్ విద్యకు మరింత ప్రాధాన్యత: బుర్రా వెంకటేశం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్:  ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావటం ద్వారా ఆధునిక విద్యావిధానాలు అందుబాటులోకి వచ్చాయని భవిష్యత్తులో డిజిటల్ విద్యకు మరింత ప్రాధాన్యం ఉంటుందని ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అభిప్రాయపడ్డారు. ఇందుకోసం అవసరమైన మౌళిక వసతుల కల్పనకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని టెక్నాలజీ, ట్రెడిషన్స్, టాలెంట్ లో తెలంగాణ ముందుందని చెప్పారు. ఓయూ దూర విద్యాకేంద్రంలో డిజిటల్ విద్య, మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సులో మూక్స్ అనే అంశంపై సీఈసీ, ఈఎమ్మార్సీ నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయస్థాయి వర్క్ షాప్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈసందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్త డిజిటల్ విద్యా అవసరాల్లో నాలుగోవంతు తెలంగాణ తీర్చనుందని చెప్పారు. డిజిటల్ విద్య కేవలం ఉపాధికి సంబంధించింది మాత్రమే కాదని వయస్సుతో సంబంధం లేకుండా కొత్త అంశాల్లో డిజిటల్ విద్య ద్వారా నాపుణ్యాలు సాధించవచ్చని చెప్పారు. ఉస్మానియా ఈఎమ్మార్సీ ద్వారా డిజిటల్ విద్యావిధానానికి ప్రాధాన్యత ఇస్తున్న సీఈసీ డైరెక్టర్ ప్రొఫెసర్ జగత్ భూషణ్ నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాలలు, కళాశాలల్లో డ్రాపౌట్లు ఆందోళన కలిగిస్తున్నాయని, డిజిటల్ విద్య డ్రాపౌట్లకు ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. 2035 నాటికి విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి ని 50 శాతానికి పెంచాలంటే డిజిటల్ విద్య మాత్రమే పరిష్కారమని చెప్పారు. స్వయం, స్వయం ప్రభ డీటీహెచ్ ఛానళ్ల ద్వారా ఉచితంగా ఆయా విభాగాల్లో డిజిటల్ పాఠాలు అందిస్తున్నామని తెలిపారు. కొద్ది రోజుల్లోనే డిజిటల్ యూనివర్శిటీ స్థాపన మన దేశంలోని మొత్తం విద్యా వ్యవస్థను మరో దశకు తీసుకెళ్తుందన్నారు. యువతరానికి సాంకేతిక అవగాహన విస్తృతంగా పెరిగిందని, ఫీచర్ ఫిల్మ్‌లు, డాక్యుమెంటరీలు మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సులు ద్వారా ఎన్నో అంశాలపై పట్టు సాధించవచ్చని చెప్పారు. రానున్న రోజుల్లో ఇవి విద్యాబోధనలో కీలక పాత్ర పోషిస్తాయని సిఈసి రెండు దశాబ్దాల ప్రయాణం, సహకారాన్ని సంగ్రహించే వీడియోను ప్రదర్శించారు.

అనంతరం ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.లక్ష్మీనారాయణ ప్రసంగిస్తూ అధ్యాపకులు నూతన సాంకేతితను అందిపుచ్చకుని డిజిటల్ టీచింగ్ అండ్ లెర్నింగ్‌కి మారాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈఎంఆర్‌సి ఓయూ బృందం అద్భుతంగా పనిచేస్తోందని వారికి సీఈసీ అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూజీసీ వ్యవహారాల ఢీన్ ప్రొఫెసర్ జి. మల్లేశం, ప్రొఫెసర్ రాములు, ప్రొఫెసర్ రాజేంద్ర నాయక్, ప్రొఫెసర్ నగేశ్ సహా పలువురు అధ్యాపకులు, పరిశోధకులు, ఆయా కళాశాలల అధ్యాపకులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News