Tuesday, December 3, 2024

కాళేశ్వరంలో ఆ ఖర్చుకు ప్రయోజనం లేకుండా పోయింది: కాగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినప్పటికి ఎక్కువ ప్రయోజనం లేకుంగా పోయిందని కాగ్ వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం కాగ్ నివేదికలను అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. విద్యుత్ వినియోగానికి ఏటా రూ.3555 అదనపు వ్యయం పెరిగిందని, రీ ఇంజినీరింగ్, మార్పుల వల్ల అప్పటికే చేసిన కొన్ని పనులు నిరర్థకమయ్యాయని వివరించారు. రీ ఇంజినీరింగ్, మార్పుల వల్ల రూ.765 కోట్ల నష్టం వాటిల్లిందని, పనుల అప్పగింతలో నీటి పారుదల అనుచిత తొందరపాటు ప్రదర్శించిందని కాగ్ మండిపడింది. డిపిఆర్ ఆమోదానికి ముందే రూ.25 వేల కోట్ల విలువైన 17 పనులు అప్పగించారని, డిపిఆర్ ఆమోదం తరువాత కూడా ప్రాజెక్టు పనుల్లో మార్పులు చేశారని, అవసరం లేకున్నా కాళేశ్వరం మూడో టిఎంసి పనులు చేపట్టారని, అదనపు టిఎం సి వల్ల రూ.25 వేల కోట్ల అదనపు వ్యయం గుర్తించామని కాగ్ ప్రకటించింది. సాగునీటి మూలధనం వ్యయం ఒక్కో ఎకరానికి రూ.6.42 లక్షలు అవుతుందని, ప్రాజెక్టు ప్రయోజన, వ్యయ నిష్పత్తి 1:51గా అంచనా వేశామని, ప్రాజెక్టు ప్రయోజన వ్యయ నిష్పతి 0.75గా తేలుతోందని, మరింత తగ్గే అవకాశం ఉందని, లోతైన భూకంప సంబంధిత అధ్యయనాలు చేయకుండానే మల్లన్న సాగర్ నిర్మించారని కాగ్ తప్పుపట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News