- Advertisement -
హైదరాబాద్: శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతుంది. జలాశయానికి సంబంధించి 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 3,60,802 క్యూసెక్కులుండగా ఔట్ ఫ్లో 3,85,809 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 884.90 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8 టిఎంసిలుగా ఉండగా ప్రస్తుత నీటి మట్టం 215.3263 టిఎంసిలుగా ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.
- Advertisement -