హైదరాబాద్: పట్టణప్రగతి కార్యక్రమంతో నగరంలో పరిశుభ్రతతో పాటు పచ్చదనం మరింత మెరుగుపడుతోంది. ప్రతి రోజు సేకరించి చెత్త కంటే అదనంగా పట్టణ ప్రగతిలో భాగంగా అదనంగా రోజూ 1500 టన్నుల నుండి 2 వేల టన్నులు పైగా చెత్తతో పాటు నిర్మాణ వ్యర్థాలు , గ్రీన్ వేస్ట్, పనికి రాని వస్తువులు సేకరించి 5250 స్వచ్ఛ అటోలతో పాటుగా కాలనీ అదనంగా అద్దె వాహనాల పెట్టి ఎప్పటి కప్పుడు డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా శనివారం 30 సర్కిళ్లలో 150 వార్డులలో 353 కాలనీలలో ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారు. గడిచిన 9 రోజుల్లో ఇప్పటి వరకు 3689 బస్తీలలో పట్టణ ప్రగతి కార్యక్రమం పూర్తి చేశారు. అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో గ్రీనరీ అభివృద్ధికికృషి చేసిన ఓ జంటను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, అధికారులు, కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పారిశుధ్యం …
తొలగించిన మొత్తం చెత్త 7,164 మెట్రిక్ టన్నులను చెత్తతోపాటు 2319 మెట్రిక్ టన్నుల నిర్మాణ వ్యర్థాలను తొలగించారు.
142 కిలోమీటర్ల మేర రోడ్డు పక్కన ఉన్న ముళ్ల పొదలను శుభ్రం చేయడంతో పాటు డ్రైనేజి, నాలాలో 17 కిలోమీటర్లు మేర పూడిక తీశారు.
1 శిథిల భవనాల వ్యర్థాల తొలగించడంతో 10 లోతట్టు ప్రాంతాలనుపూడ్చివేశారు.
3,470 ప్రాంతాల్లో స్ప్రేయింగ్, ఫాగింగ్ నిర్వహించారు.
18 మంచినీటి ట్యాంక్ లు, పరిసరాలను శుభ్రంచేశారు.
58 పార్కుల ఆవరణలతో పాటు 93 కమ్యూనిటీ స్థలాలు, ప్రభుత్వ విద్యాలయాలు, ప్రభుత్వ భవన సముదాయాలుపరిశుభ్రపర్చారు.
1044 మరుగుదొడ్లు శుభ్రం చేశారు.
36 వైకుంఠదామాలు, శానవాటికల్లో ఉన్న వ్యర్థాలను తొలగించి పరిశుభ్రం చేశారు.
ఎంటామాలజీ విభాగం 1,00,438 ఇళ్లలో యాంటీలార్వాచర్యతో పాటు 98, 732 ఇళ్లలో ఫాగింగ్ చేశారు.
గ్రీనరీ
2704 మొక్కలు నాటడంతో పాటు 6,596ఇళ్లకు మొక్కలను పంపిణీ చేశారు. 1141 మీటర్లు రోడ్డు మధ్యలో (మీడియన్ ప్లాంటేషన్), 1 కిలోమీటర్ల రోడ్డు మార్గంలోమల్టీలెవల్‌అవెన్యూ ప్లాంటేషన్ పూర్తి చేశారు. 2823 మొక్కలకుసాసర్ చేసి,కలుపు తీశారు.