ఇజ్రాయెల్ : గాజా లోని మరింత భూభాగాన్ని ఆక్రమించాలని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్)ను దేశ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఆదేశించారు. మరింత మంది బందీలను విడుదల చేసేందుకు హమాస్ నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓ ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది. గాజా పట్టీలోని అదనపు ప్రదేశాలను ఆక్రమించాలని కాట్జ్ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇప్పటికే పాలస్తీనా పౌరులు ఉన్న ప్రదేశాలను ఖాళీ చేయాలని ఐడీఎఫ్ బలగాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. “ఐడీఎఫ్ బలగాలు, ఇజ్రాయెల్ ప్రజలను రక్షించేందుకు గాజాలో సెక్యూరిటీ జోన్లను విస్తరించండి.న బందీలను విడుదల చేసేందుకు హమాస్ జాప్యం చేసేకొద్దీ, మరింత భూమిని కోల్పోతుంటుంది. దానిని ఇజ్రాయెల్‌లో విలీనం చేసుకొంటుంది ” అని కాట్జ్ ఆదేశాల్లో పేర్కొన్నారు. బుధవారం రాత్రి నుంచి ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 85 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. 133 మందికి గాయాలయ్యాయి.
గాజాలో మరింత భూభాగం ఆక్రమించండి : ఇజ్రాయెల్ ఆదేశాలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -