Wednesday, January 22, 2025

కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు ఉంటాయి: థాక్రే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జీ మాణిక్‌రావ్ థాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. బిఆర్‌ఎస్, బిజెపికి బి టీమ్ అని.. బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలు రెండు ఒకటేనని తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు. పాట్నాలో విపక్షాల సమావేశానికి బిఆర్‌ఎస్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు.

మహారాష్ట్రకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వెళ్లడం వల్ల ఒరిగేదేమి లేదన్నారు.మహారాష్ట్ర నుండి బిఆర్‌ఎస్‌లో చేరే వారివల్ల ఎలాంటి నష్టం ఉండదన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీనేనని మాణిక్‌రావ్ థాక్రే అన్నారు. కాంగ్రెస్ పట్ల తెలంగాణ ప్రజలు విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. సర్వేలు, గెలుపు ప్రాతిపదికనే పార్టీలో ఎవరికైన టికెట్లు ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు.

Also Read: యూనివర్సిటీ వీసీలతో గవర్నర్ తమిళిసై సమావేశం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News