Wednesday, January 22, 2025

కొత్త పన్ను విధానంతో ప్రజల చేతిలో ఎక్కువ డబ్బు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన కొత్త పన్నుల విధానం వల్ల ప్రజల చేతిలో ఖర్చు చేయడానికి ఎక్కువ డబ్బులు ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం చెప్పారు. కేంద్రం బడ్జెట్‌లో ప్రకటించిన కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వార్షికాదాయం దాకా ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేని విషయం తెలిసిందే. ఆర్థిక పరిస్థితి పరిమితిలో అభివృద్ధి అవసరాలను సమతల్యత చేస్తూ బడ్జెటణు తెలివిగా రూపొందించినట్లు లోక్‌సభలో 2023 24 కేంద్ర బడ్జెట్‌పై జరిగిన చర్చకు సమాధానమిస్తూ మంత్రి చెప్పారు. బడ్జెట్ ప్రధానంగా మధ్య తరగతి, ఉపాధి కల్పన, ఎంఎస్‌ఎంఇ, వ్యవసాయ రంగం, గ్రామీణ జనాభా, ఆరోగ్యం, హరిత వృద్ధిపై దృష్టిపెట్టినట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు.

కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన కొత్త పన్ను విధానం ఎంతో ఆకర్షణీయమైనదని, ఎందుకంటే పన్ను మినహాయింపు పరిమితిని ఇప్పుడున్న 2.5లక్షలనుంచి రూ.3 లక్షలకు పెంచడం జరిగిందని, ఇదే కాకుండా రూ.50,00 స్టాండర్డ్ డిడక్షన్‌ను కూడా అనుమతించడం జరిగిందని ఆర్థిక మంత్రి చెప్పారు.పెంచిన రిబేట్ పరిమితిఎలాంటి షరతులు లేనిది కావడంతో ప్రజల చేతుల్లో ఖర్చు చేయడానికి ఎక్కువ డబ్బులు ఉంటాయని ఆమె చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News