Wednesday, January 22, 2025

భవిష్యత్తులో మరిన్ని విద్యుత్ సంస్కరణలు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: బిఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ విద్యుత్ రంగానికి సిఎం కెసిఆర్ నూతన ఓరువడలకు శ్రీకారం చుట్టారని జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా శర్మ అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి సంక్షేమ భవనంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ ప్రగతి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యుత్ రంగంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయని వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందించడంలో అద్భుతమైన ప్రగతిని సాధించామని అన్నారు. గత ప్రభుత్వాల కాలంలో అన్నదాతలు అనేక ఇబ్బందులను ఎదుర్కున్నారని ప్రస్తుతం అన్నదాతలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్ విద్యుత్ రంగంలో అనేక నూతన ఓరువడలకు శ్రీకారం చుట్టారని అన్నారు.

విద్యుత్ రంగంలో వచ్చిన మార్పులు సాధించిన విజయాలు చేసిన ప్రగతి విద్యుత్ శాఖ అధికారులు సమావేశం సందర్భంగా వివరించారు. ఒకప్పుడు కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని అయోమయో స్థితిలో ఉన్న ప్రజలు నేడు 24 గంటల కరెంటుతో ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. రైతులకు 24 గంటల కరెంటు ఇచ్చి రైతాంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వెన్ను దన్నుగా నిలిచారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ఎంతో పటిష్టం చేసిందని విద్యుత్ సరఫరా లో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా అధికారులు సిబ్బంది తక్షణమే స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని విద్యుత్ సంస్కరణలు తీసుకువచ్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా విద్యుత్ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నామని అన్నారు.

విద్యుత్ రంగంలో తెలంగాణ సాధించిన విజయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ ఈ మహేష్ మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు వైస్ చైర్మన్ కనకరాజు ఎంపీపీలు మాణిక్య రెడ్డి బాలమల్లు ఈజీఎస్ స్టేట్ కౌన్సిలింగ్ మెంబర్ బాల్ రంగం, అర్బన్ మండల ఏఈ కనకరాజు, ఆయా మండల విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News