- Advertisement -
న్యూఢిల్లీ: భారత వాతావరణ శాఖ(ఐఎండి) దేశవ్యాప్తంగా ఉండే రైతులకు శుభవార్తను అందించింది. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్డడించింది. నైరుతి రుతుపవనాలతో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడతాయని పేర్కొంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. తెలంగాణ, ఎపిల్లో కూడా ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు.. మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కర్ణాటకలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. దేశంలో 1971-2020 మధ్యకాలంలో దీర్ఘకాల సగటు 87 సెం.మీలు ఉండగా.. మొత్తం దీర్ఘకాల సగటు వర్షపాతం 105 శాతంగా ఉంటుందని వెల్లడించింది.
- Advertisement -