హన్మకొండలో వరి పంట నష్టం
ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్
మన తెలంగాణ,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో అయితే వారం రోజుల పాటు వానలు కురిసే అవకాశం ఉందని, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం హన్మకొండలో కురుసిన ఆకాల వర్షాల కారణంగా వరి పంట తీవ్రంగా దెబ్బతిన్నది. హన్మకొండ జిల్లాలో వరిధాన్యం తడిసిముద్దయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అకాల వానలు మింగేశాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.
ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురియడంతో తీవ్రంగా పంగనష్టం వాటిల్లింది. దీంతో వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. బుధవారం సంగారెడ్డి, వికారాబాద్, జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూలు, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం, నలగొండ, ములుగు, పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల , నిర్మల్ , నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ , రాజన్న సిరిసిల్లా జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురిసే ఛాస్స్ ఉందని వాతావణ శాఖ తెలిపింది. గురు , శుక్ర, శని వారాల్లో మోప్తారు కురిసో అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాల్లో మోస్తాలరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.