ఒమైక్రాన్ భయంతో బస్తీ దవాఖానాలకు పరుగులు
చలితో జలుబు, దగ్గుతో బాధపడుతున్నట్లు వైద్యులకు వెల్లడి
రోజుకు 60నుంచి 70 మందికి పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది
నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పు తప్పదంటున్న జిల్లా వైద్యాధికారులు
మన తెలంగాణ/సిటీబ్యూరో: నగరంలో గత ఐదారు రోజుల నుంచి ఒమైక్రాన్ భయాందోళనలతో ప్రజలు కరోనా టెస్టులు చేసుకునేందుకు బస్తీ దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద బారులు కడుతున్నా రు. చలి ప్రభావంతో దగ్గు, జలుబు వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నట్లు సీజనల్ వ్యాధులా , కరోనా వైరస్ అంటూ భయపడుతూ వ్యాధులు నిర్దారణ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి తోడు కొత్తవేరియంట్లు పుట్టుకరావడంతో థర్డ్‌వేవ్ వస్తుందనే భ య ంతో ముందుస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
సెకండ్ వేవ్‌లో ముందుగా విద్యాసంస్థల నుంచి వైరస్ విజృంభణ చేయగా, తా జాగా గురుకులాలు, వసతి గృహాల్లో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. ఈ దెబ్బతో మరోసారి మహమ్మారి రెక్కలు కట్టుకునే వాతావరణ ఉందని జనం లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదిస్తున్నారు. గత మూడు రోజుల నుంచి జనం ఆసుపత్రులకు వస్తున్న ట్లు, వైరస్ విజృంభణతోనే జనం టెస్టులకు వస్తున్నట్లు ఆసుపత్రులు సిబ్బంది వెల్లడిస్తున్నారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అందుబాటులో ఉండి రోగులకు పలు రకాల సేవలందిస్తున్నట్లు చెబుతున్నారు. నగరంలో 258బస్తీలు, 98 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో ప్రజలు జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యం కాపాడుకోవచ్చని వైద్యశాఖ పేర్కొనడంతో నగర ప్రజలు వైరస్ లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేసుకుంటున్నారని ఆరోగ్య కార్యకర్తలు సి బ్బంది చెబుతున్నారు.
దీని దృష్టిలో పెట్టుకుని సరిపడ కిట్లు, సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంటున్నా రు. వచ్చే నెల రోజుల పాటు వరుసగా పండగలు ఉండటంతో కరోనా ఉనికిచాటే అవకాశముందని, వేడుకలను పరిమిత సంఖ్యలో చేయాలని, ఒకే దగ్గర గుంపులుగా ఉండి విందులు చేస్తే మహమ్మారి పంజా విసురుతుందని, ఇప్పటికి రోజు 70 నుంచి 80కి పైగా పాజిటివ్ కేసులు నమోదైతున్నట్లు, ప్రజలు కొవిడ్ జాగ్రత్తలు పాటించి, ఆరోగ్యం కాపాడుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.