Wednesday, January 22, 2025

మరింత వేగంగా మక్తల్ పట్టణ అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

మక్తల్ :దిన దినాభివృద్ధి చెందుతున్న మక్తల్ పట్టణంలో ప్రత్యేక అభివృద్ధి నిధులు కేటాయించి అభివృద్ధ్దిని మరింత వేగవంతం చేద్దామని ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని 16వ వార్డు పరిధిలో గల ఎల్‌బీ కాలనీలో రూ. 30 లక్షల ఎస్టిఎఫ్ నిధుల నుంచి చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులను మంగళవారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో దాదాపు 20 కోట్లతో అభివృద్ధి ్ద పనులను చేపట్టడం జరిగిందన్నారు. అన్ని కాలనీలో సీసీరోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను చేపడుతున్నామని అన్నారు. అభివృద్ధ్ది విషయంలో అందరూ కలిసికట్టుగా మందుకు సాగాలని అన్నారు. ఈ సందర్భంగా వార్డు అభివృద్ధ్దికి నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డిని స్థానికులు పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు.
కురుమలకు అండగాబిఆర్‌ఎస్ ప్రభుత్వం: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వం కురుమలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే అన్నారు. పట్టణంలోని సంత బజార్ సమీపంలో కురుమ సంఘం కమ్యూనిటీ హల్ నిర్మాణానికి మంగళవారం ఎమ్మెల్యే చిట్టెం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కురుమలు ఆర్ధికంగా ఏదిగేందుకు ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు.

ఇటీవల రెండో విడతలో భాగంగా అర్హులైన లబ్ధ్దిదారులకు గొర్రెలను పంపిణీ చేస్తున్నామన్నారు. ఆయా కార్యక్రమాల్లో బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, పట్టణ అధ్యక్షులు అమరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీలు కోళ్ల వెంకటేష్, రవిశంకర్‌రెడ్డి, లక్ష్మణ్, నాయకులు శాలం, గాల్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, రాంమాధవ్, మధు, జుట్ల సాగర్, బండారి ఆనంద్, కురుమ సంఘం నాయకులు నాగరాజు, ఎల్లలింగ, కుర్వ లింగం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News