జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలి
రాచకొండ సిపిని కలిసిన ఎసిపిలుగా పదోన్నతి పొందిన ఇన్స్‌స్పెక్టర్లు
మనతెలంగాణ, సిటిబ్యూరో: ప్రమోషన్ ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి జీవితంలో ఒక మైలురాయి వంటిదని, పోలీసులు మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ అన్నారు. కమిషనరేట్ పరిధిలో ఇన్స్‌స్పెక్టర్లుగా విధులు నిర్వర్తిస్తున్న వారు ఎసిపిలుగా ఇటీవలే పదోన్నతి పొందారు. పదోన్నతి పొందిన వారు సోమవారం నేరెడ్‌మెట్‌లోని కార్యాలయంలో రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. పదోన్నతి పొందిన పోలీస్ అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు.
Also Read: నడ్డా ఇది కెసిఆర్ అడ్డా: జేపీ నడ్డా వ్యాఖ్యలపై మంత్రి వేముల ఆగ్రహం
ఈ సందర్భంగా సిపి డిఎస్ చౌహాన్ మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఎన్నో ఎళ్ల నుంచి ప్రజల సంరక్షణ కోసం అవిశ్రాంతంగా పనిచేసిన దానికి పదోన్నతులు గొప్పగుర్తింపు అన్నారు. ప్రమోషన్ ఉద్యోగి జీవితంలో మైలురాయి వంటిదని, ఇక నుంచి మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని కోరారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు మరింత పేరు తీసుకుని వచ్చేలా పనిచేయాలని అన్నారు. కార్యక్రమంలో ఎసిపిలు లక్ష్మి, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, నరేందర్‌గౌడ్, జానకిరెడ్డి, నవీన్ , నవీన్ రెడ్డి, ప్రకాష్ తదితరులు ఉన్నారు.