Monday, January 20, 2025

మరో వేరియంట్ పుట్టుకొస్తే.. ఒమిక్రాన్ కన్నా తీవ్రం : డబ్ల్యూహెచ్‌ఒ

- Advertisement -
- Advertisement -

more severe than Omicron: WHO

జెనీవా: ప్రపంచవ్యాప్తంగా వెలుగుచూస్తున కరోనా కేసుల్లో సింహభాగం ఒమిక్రాన్ వేరియంట్‌దే. ఈ వేరియంటే ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అయితే ఇప్పుడు అనేక దేశాల్లో కేసులు దిగి వస్తున్నాయి. ఇదిలావుండగా ఒమిక్రాన్ తగ్గిపోయాక మరో వేరియంట్ వస్తుందా? వస్తే దాని తీవ్రత ఎలా ఉండబోతోంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఒ) స్పందించింది. మరో వేరియంట్ కనుక పుట్టుకొస్తే దాని వ్యాప్తి ఒమిక్రాన్ కంటే తీవ్రంగా ఉండగలదని వెల్లడించింది. కొత్త వేరియంట్ కనుక పుట్టుకొస్తే, ఇప్పుడు వ్యాప్తిలో ఉన్న వేరియంట్ల కంటే అధిక శక్తిసామర్థాలు కలిగి ఉండగలదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సాంకేతిక విభాగాధిపతి మరియా వాన్ కెర్ఖోవ్ తెలిపారు. కొత్తగా పుట్టుకొచ్చే వాటికి రోగనిరోధక శక్తిని ఏమార్చే గుణం కూఆ అధికంగా ఉండొచ్చు, టీకాల ప్రభావం కూడా వాటిపై ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ‘ప్రపంచం ఇలాంటి స్థితికి రాకూడదని కోరుకుంటున్నాం. అందుకే కొవిడ్ వ్యాప్తిని అరికట్టాలని కోరుతున్నాం. కట్టుదిట్టమైన నిబంధనలతో వైరస్ వ్యాప్తి స్వల్పంగానే ఉంటుందని ఆశిస్తున్నాం’ అని ఆమె పేర్కొన్నారు. కరోనా వైరస్ శ్వాసకోశ వ్యాధికారకం కాబట్టి సీజన్ వ్యాధిగా రూపాంతరం చెందే అవకాశాలు కూడా ఉన్నట్లు వాన్ కెర్ఖోశ్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News