కార్పొరేటర్ చేసిన ప్రయత్నాలకు అధికారులు ఏమాత్రం వినకుండా కూల్చివేసిన అధికారులు
మన తెలంగాణ /బోడుప్పల్ : బో డుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అనుమతి లేని షెడ్లను టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రతినిధులు నేతృత్వంలో కూల్చి వేసింది. కార్పొరేష న్ పరిధిలోని 1వ డి విజన్ రామకృష్ణానగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన భారీ షెడ్లను పోలీసు బందోబ స్తు మధ్య కూల్చివేయించారు. అయితే అక్రమ నిర్మాణాల కూల్చివేతను అడ్డుకునేందుకు స్థానిక కార్పొరేటర్ చేసిన ప్రయత్నాలకు అధికారులు ఏమాత్రం వినకుండా కూల్చివేతను కొనసాగించారు. కొన్ని సంవత్సరాలుగా రామకృష్ణనగర్‌లో ఎలాంటి అనుమతులు లేకుంగా విచ్చలవిడిగా షెడ్లను నిర్మించారు. అక్రమ నిర్మాణాలను ఆరికట్టడంలో మున్సిపల్ అధికారులు బాధ్యతరహితంగా వ్యవహరించడం వల్లనే ఇక్కడ పెద్ద ఎత్తున నిర్మాణాలు జరిగాయి. అయితే అక్రమ నిర్మాణాల కూల్చివేతలో మున్సిపల్ టౌన్ ఫ్లానింగ్ అధికారులు పాల్గొనాల్సి ఉండగా వారు విధులకు డు మ్మా కొట్టడం గమనార్హం. దీంతో పాటు చేసేదేమీలేక టాస్క్ ఫోర్స్ కమిటీలోని రెవిన్యూ ఇన్సిఫెక్టర్లు సునీత ,షాలినీల నేతృత్వంలో మున్సిపల్ అ ధికారులు గుర్తించిన అక్రమ నిర్మాణాలను భారీ పోలీసు బందోబస్తు మ ధ్య నేలమట్టం చేయించారు. ఈ కూల్చివేతల కార్యక్రమంలో మేడిపల్లి ఎస్సై రఘురామ్, టౌన్ ప్లానింగ్ సిబ్బంది శేఖర్, జాన్‌పాల్ పాల్గొన్నారు.