Sunday, December 22, 2024

అభ్యర్థుల కదలికపై మరింత నిఘా

- Advertisement -
- Advertisement -

సమాచార సేకరణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఎఐ) టూల్స్
ఢిల్లీలో ఐఐఐడి ఈఎం సెల్ ఏర్పాటు
ఎన్నికల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ
బెంగళూరులో అధ్యయనం చేసిన ఎన్నికల బృందం

హైదరాబాద్: రానున్న శాసనసభ ఎన్నికలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) సాంకేతికతను వినియోగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతున్నది. ఇటీవలే రాష్ట్ర ఎన్నికల అధికారుల బృందం కర్నాటకలో పర్యటించింది. శాసనసభ, తదితర ఎన్నికలకు అక్కడి ఎన్నికల సంఘం అనుసరించిన ఉత్తమ విధానాలపై అధ్యయనం చేసింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ), ఫేస్ రికగ్నిషన్ సిస్ట మ్ విధానాలపై ప్రధానంగా దృష్టి సారించారు. వాటి వినియోగంపై సాంకేతిక నిపుణులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

ఈ క్రమంలోనే ఎఐ సాంకేతికత సహాయం తో మరికొన్ని అంశాల్లో ఎన్నికల సంఘం విస్తృతంగా వాడాలనుకుంటున్నది. అభ్యర్థులు చేసే ఖర్చు, ఓటర్ల ను ప్రలోభ పెట్టడం వరకు అన్నింటిపైనా నిఘా కొనసాగించడం ఎఐ వినియోగం ప్రధాన లక్ష్యం. ప్రతి నిమి షం అభ్యర్థుల కదలికలను ఎఐ టూల్స్ విశ్లేషిస్తాయి. ఐఎఎస్ అధికారులు మొదలు క్షేత్రస్థాయిలోని ప్రభుత్వ సిబ్బంది వరకు ఈ టెక్నాలజీని సమర్థవంతంగా వాడాలని ఎన్నికల సంఘం భావిస్తున్నది. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఫస్ట్ టైమ్ ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ను వినియోగించింది. దీనికి కొనసాగింపుగా తెలంగాణలో సైతం ఎఐ టూల్స్ సహాయంతో సేవలను మరికొన్ని అంశాల్లో విస్తృతంగా వాడాలనుకుంటున్నది. ఎఐ వినియోగం కోసం ప్రత్యేకంగా ఢిల్లీలో ఐఐఐడి ఈఎం సెల్ ను ఏర్పాటు చేశారు.

ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ఇప్పటికే 20 రకాల మొబైల్ యాప్‌లను ఎన్నికల సంఘం రూపొందించింది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణలో ఉత్తమ విధానాలను అవలంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటింగ్‌పై ఓటర్లకు అవగాహన కల్పించడం, సౌకర్యాలను అందుబాటులోకి తేవ డం మొదలు అభ్యర్థులు మద్యం, మనీ ద్వారా ఓటర్లను ప్రభావితం చేయడాన్ని కట్టడి చేయడం, ఎన్నికలను పా రదర్శకంగా నిర్వహించడం, అవకతవకలను నివారించడం వరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నది. అభ్యర్థులు నామినేషన్ పత్రాల్లో పొందుపరిచే ఫోన్ నంబర్, పాన్‌కార్డు, ఆధార్‌కార్డు లాంటి వివరాల ను ఎఐ టూల్స్ ద్వారా ఎన్నికల సంఘం సమర్థవంతం గా వాడుకోనున్నది.

వాటి ఆధారంగానే అభ్యర్థుల కదలికలు, రోజు వారీ ఖర్చు, బ్యాంకు లావాదేవీలు, సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు, ఓటర్లను ప్రలోభపెట్టే విధానాలు, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు.. వీటిపై 24 గంటలూ ఎఐ టూల్స్ సాయంతో ఏర్పడే ప్రత్యేక వ్యవస్థ నిఘా వేస్తుంది. అభ్యర్థుల నుంచి అనుచరులు, కార్యకర్తలు, ఏజెంట్లకు వెళ్లే ఆదేశాలు మూడో కంటికి తెలియకుండా ఎఐ టూల్స్ ఆధారంగా ఏర్పడే సర్వియలెన్స్ మెకానిజం ఎప్పటిప్పుడు క్రోడీకరిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News