రాజన్న సిరిసిల్ల: మన ఊరు-మన బడి పథకంలో పాఠశాలలు తీర్చిదిద్ధామని మంత్రి కెటిఆర్ తెలిపారు. సిరిసిల్లలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను మంత్రి కెటిఆర్ ఆవిష్కరించారు. జిల్లాలో 172 కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించామని, ఒకనాడు దగాపడిన పల్లెలు నేడు ధగధగలాడుతున్నాయని ప్రశంసించారు. స్వచ్ఛసర్వేక్షణ్ అవార్డులో తెలంగాణదే సింహభాగమని కొనియాడారు. మన మున్సిపాలిటీలు, పట్టణాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని మెచ్చుకున్నారు.
Also Read: రైతుకు రుణ విముక్తి
రాష్ట్రానికి, దేశానికి ఆదర్శంగా సిరిసిల్ల జిల్లా ఉందని, సిరిసిల్ల పట్టణంలో అద్భుతంగా అభివృద్ధి పనులు చేస్తున్నామని వివరించారు. అర్భన్ ఫారెస్ట్ పార్క్ త్వరంలో ప్రారంభిస్తామని కెటిఆర్ వెల్లడించారు. విద్యరంగానికి హబ్‌గా సిరిసిల్లను మారుస్తున్నామని, ధరణి పోర్టల్ ద్వారా భూ సమస్యలు పరిష్కరిస్తున్నామని, నేతన్నలను ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని కెటిఆర్ మెచ్చుకున్నారు. రూ.2500 కోట్లతో బతుకమ్మ చీరలు సహా పలు అవార్డులు ఇచ్చామని, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, విఆర్‌ఎలను రెగ్యులరైజ్ చేశామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ లేకుండా పని చేస్తున్నామని, అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్‌లో శిక్షణ ఇస్తున్నామన్నారు.
Also Read: సంపద పెంచి పేదలకు పంచుతున్నాం: కెసిఆర్