- Advertisement -
దంతెవాడ: దేశంలో కోవిడ్ కల్లోలం సృష్టిస్తోంది. తాజాగా కరోనా మహమ్మారి బారినపడి పదిమందికి పైగా మావోయిస్టులు మృతి చెందిన సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా దక్షణి బస్తర్ అడవుల్లో చోటుచేసుకుంది. ఈ విషయాన్ని దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ తెలిపారు. మరో వంద మందికిపైగా కరోనా బారిన పడినట్టు తమకు సమాచారం అందిందన్నారు. కరోనా, కలుషిత ఆహారం తినడంతో మావోలు మృతిచెందినట్టు తెలిసిందని, కరోనాతో చనిపోయిన వారిలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారని ఎస్పీ అభిషేక్ పేర్కొన్నారు. అయితే చనిపోయిన మావోయిస్టుల పేర్లు ఇంకా వెల్లడి కాలేదని ఆయన తెలిపారు. కుంట, డోర్నపాల్ ఏరియాల్లో మావోయిస్టులు కోవిడ్ వ్యాక్సిన్‌తో పాటు ఔషదాలను దొంగిలించినట్లు పోలీసులు వెల్లడించారు.
- Advertisement -