- Advertisement -
బెర్లిన్: కరోనా మృతుల సంఖ్య లక్ష దాటిన దేశాల్లో తాజాగా జర్మనీ చేరింది. గత ఏడాది కరోనా వైరస్ వ్యాప్తి చెందినప్పటి నుంచి జర్మనీలో అధికారిక లెక్కల ప్రకారం గురువారం నాటికి లక్ష మందికి పైగా మరణించారు. గడచిన 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా మరో 351 మంది మరణించడంతో జర్మనీలో మొత్తం మరణాల సంఖ్య 1,00,119కి పెరిగినట్లు జర్మనీకి చెందిన ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించింది. యూరప్‌లో కరోనా మరణాలు లక్ష దాటిన దేశాలలో రష్యా, బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్స్ దేశాల సరసన తాజాగా జర్మనీ చేరింది. తాజాగా..గడచిన 24 గంటల్లో 75,961 కరోనా కేసులు నమోదయ్యాయని జర్మన్ ప్రభుత్వ అధీనంలోని రాబర్ట్ కోచ్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 55 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదైనట్లు సంస్థ తెలిపింది.
- Advertisement -