Thursday, December 12, 2024

మంత్రాలతో కొడుకుని చంపేశారని 200 మందికిపైగా హత్య

- Advertisement -
- Advertisement -

హైతీలో ఒక గ్యాంగ్‌స్టర్ కుమారుడు అనారోగ్యానికి గురయ్యాడు. మంత్రాలు చేయడమే ఈ అనారోగ్యానికి కారణమని స్థానిక పూజారి చెప్పాడు. దీనితో రెచ్చిపోయిన ఆ గ్యాంగ్‌స్టర్ తన అనుచరులతో కలసి ఊరిలోని వృద్ధులను ఊచకోత కోశాడు. దాదాపు 200 మందిని నిర్దాక్షిణ్యంగా అతను చంపేశాడు. వృద్ధులను కాపాడబోయిన వారినీ అతను చంపేశాడు. అసలు ఏమి జరిగింది అంటే& హైతీ రాజధాని పోర్ట్ ఓ ప్రిన్స్‌లో గ్యాంగ్‌స్టర్ల ప్రభావం అధికం. నగరానికి చెందిన ఒక గ్యాంగ్‌స్టర్ కుమారుడు ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు, దీనిపై స్థానిక మత గురువును ఆశ్రయించగా, మంత్ర ప్రయోగమే కారణమని చెప్పాడు. దీనితో ఆగ్రహించిన గ్యాంగ్‌స్టర్ వృద్ధులను, మంత్రాలు వచ్చనే అనుమానం ఉన్న వారిని లక్షంగా చేసుకుని నగరంలో మారణ హోమం సృష్టించాడు.

ఒక్క రోజే అరవై మందిని అతను చంపేశాడు. అతను ఇళ్లలోకి చొరబడి 60 ఏళ్లు పైబడిన వారిని కాల్చి చంపాడు. ఆ మరునాడే గ్యాంగ్‌స్టర్‌కుమారుడు చనిపోయాడు. కుమారుని కోల్పోయిన దుఃఖంతో మరింత రెచ్చిపోయిన గ్యాంగ్‌స్టర్ వృద్ధులతో పాటు వారిని కాపాడే ఉద్దేశంతో నగరంలో నుంచి బయటకు తీసుకువెళ్లేందుకు యత్నించినవారినీ చంపేశాడు. మూడు రోజుల పాటు సాగిన ఆ మారణహోమంలో 200 మందికి పైగా చనిపోయారని హైతీ అధికార వర్గాలు వెల్లడించాయి. గ్యాంగ్‌స్టర్ అనుచరులు మృతదేహాలను నడిరోడ్డుపైనే కాల్చేయడంతో మరణించినవారి సంఖ్యపై స్పష్టత కొరవడిందని ఆ వర్గాలు చెప్పాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News