Saturday, November 23, 2024

ప్రయాణాలు తప్పిన రైళ్లు

- Advertisement -
- Advertisement -

More than 200 trains rescheduled with Agneepath

అగ్నిపథ్‌తో 200కు పైగా రీషెడ్యూల్
35 రైళ్లు రద్దు..13 రైళ్ల నిలిపివేత
ప్రధాన రూట్లలో జనం హైరానా

న్యూఢిల్లీ : సైనిక నియామకాల సంబంధిత అగ్నిపథ్‌కు నిరసనగా చెలరేగిన నిరసనల ప్రభావం దేశవ్యాప్తంగా రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపింది. ఇప్పటివరకూ 200కు పైగా రైళ్ల రాకపోకల షెడ్యూల్‌లో మార్పులు చేశారు. హింసా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి 35 రైళ్లను రద్దు చేశారు. రైళ్లపై పెను ప్రభావం వివరాలను రైల్వే శాఖ అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 13 రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు. పలు రైళ్ల దారి మళ్లించారు. హైదరాబాద్ ఇతర ప్రధాన నగరాలలో ఎంఎంటిఎస్, మెట్రోరైళ్లను అధికారులు ముందు జాగ్రత్త చర్యగా శుక్రవారం ఉదయం తరువాత నిలిపివేశారు. దీనితో రోడ్డు మార్గాలు కిక్కిరిసిపొయ్యాయి. దేశంలో ప్రత్యేకించి తూర్పు మధ్య రైల్వే నిర్వహణలోని మార్గాలలో రైళ్లరాకపోకలు అతలాకుతలం అయ్యాయి. బీహార్ , జార్ఖండ్ , ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో హింసాత్మక ఘటనలు ఎక్కువగా జరగడంతో అక్కడ ఎక్కువగా రైళ్లు రద్దు లేదా దారిమళ్లింపు జరిగాయి.

పలు ప్రాంతాలలో ప్రయాణికులు నానా అగచాట్లకు గురయ్యారు. రిజర్వ్ చేసుకున్న రైళ్లు రద్దు కావడ ంతో ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవడం ప్రధాన సమస్యగా మారింది. బీహార్, జార్ఖండ్, యుపిల్లో ఎనిమిది రైళ్ల నిర్వహణపై ఉన్నతాధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షణ జరిపారు. శుక్రవారం సికింద్రాబాద్ ఇతర ప్రాంతాలలో రైల్వే స్టేషన్లలో ఘర్షణలు, బోగీలకు నిప్పంటించడం వంటి ఘటనల తరువాత దక్షిణ మధ్య రైల్వేపై కూడా ప్రభావం పడింది. సుదూర ప్రయాణాల రైళ్ల విషయంలో పరిస్థితిని బట్టి కీలక నిర్ణయం తీసుకుంటారని, ప్రస్తుతానికి వీటిని నిలిపివేశామని అధికారులు తెలిపారు. హౌరా న్యూఢిల్లీ పూర్వా ఎక్స్‌ప్రెస్, హౌరా లల్కూనా ఎక్స్‌ప్రెస్, రాంచీ పాట్నా పత్లిపుత్ర ఎక్స్‌ప్రెస్, ధానాపూ టాటా ఎక్స్‌ప్రెస్, జయ్‌నగర్ హౌరా ఎక్స్‌ప్రెస్, హౌరా ధన్‌బాద్ డైమండ్ ఎక్స్‌ప్రెస్, అసన్‌సోల్ కియుల్ ఎక్స్‌ప్రెస్ వంటివి ప్రస్తుతానికి నిలిచిపోయిన రైళ్లు. రద్దు అయిన రైళ్లలో హైదరాబాద్ షాలిమార్ ఎక్స్‌ప్రెస్, అహ్మద్‌నగర్ సికింద్రాబాద్ , సికింద్రాబాద్ అహ్మద్‌నగర్ ఉన్నాయి. తూర్పు మధ్య రైల్వే మార్గంలో వెళ్లే నార్త్ ఫ్రాంటియర్ రైల్వే పరిధిలోని పలు రైళ్లపై కూడా ప్రభావం పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News