అగర్తలా: కుండపోత వర్షం కారణంగా పశ్చిమ త్రిపుర జిల్లాలోని సదర్ సబ్‌డివిజన్‌లో వరదల కారణంగా 2,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారని అధికారులు జూన్ 18న తెలిపారు. “వారు 20 సహాయ శిబిరాల్లో తలదాచుకున్నారు. అయితే, ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు ”అని అధికారులు చెప్పారు.
పశ్చిమ త్రిపుర జిల్లాలో గత 24 గంటల్లో 155 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీనివల్ల హౌరా నది ఒడ్డున ఉన్న పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. “హౌరా నదిలో నీటి మట్టం ప్రమాద స్థాయి కంటే కొంచెం ఎక్కువగా ప్రవహిస్తోంది, అగర్తలా దక్షిణ ప్రాంతాల్లోని అనేక లోతట్టు ప్రాంతాలకు ముప్పు పొంచి ఉంది. మరింతగా వర్షాలు కురిస్తే పరిస్థితి ఇంకా దిగజారవచ్చు” అని సదర్ సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ అషిమ్ సాహా చెప్పారు. పోలీసులు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ , అడ్మినిస్ట్రేషన్ సంయుక్తంగా ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, సహాయక చర్యలను నిర్వహిస్తున్నాయి.