Sunday, December 22, 2024

మరో 25కి పైగా విమానాలకు బెదిరింపులు

- Advertisement -
- Advertisement -

వివిధ భారతీయ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 25కి పైగా దేశీయ, అంతర్జాతీయ విమానాలకు శుక్రవారం బాంబు బెదిరింపులు ఎదురైనట్లు వర్గాలు తెలిపాయి. కోజిక్కోడ్ నుంచి దమ్మం వెళ్లే 6 87 విమానంతోసహా తమ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 7 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు ఇండిగో అధికార ప్రతినిధి శుక్రవారం తెలిపారు. ఇండిగో,విస్తారా, స్పైస్‌జెట్‌కు చెందిన ఏడేసి విమానాలకు బెదిరింపులు రాగా ఎయిర్ ఇండియాకు 6 బెదిరింపులు వచ్చాయని వర్గాలు వివరించాయి. ఇండిగోకు చెందిన 6 2099(ఉదయ్‌పూర్ నుంచి ఢిల్లీకి), 6ఇ 11(ఢిల్లీ నుంచి ఇస్తాన్‌బుల్‌కు),

6ఇ 58(జెడ్డా నుంచి ముంబైకి), 6ఇ 17(ముంబై నుంచి ఇస్తాన్‌బుల్‌కు) 6ఇ 108(హైదరాబాద్ నుంచి చండీగఢ్‌కు), 6ఇ 133(పుణె నుంచి జోధ్‌పూర్‌కు) విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు ఇండిగా ప్రతినిధి చెప్పారు. గడచిన 12 రోజులలో వివిధ భారతీయ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 275 విమానాలకు బాంబు బెదిరింపులు ఎదురయ్యాయి. వీటిలో చాలావరకు అన్నీ సోషల్ మీడియా ద్వారా వచ్చిన బూటకపు బాంబు బెదిరింపులే కావడం గమనార్హం. కాగా..బూటకపు బాంబు బెదిరింప మెసేజ్‌లకు సంబంధించిన డాటాను తమకు షేర్ చేయాలని ఇప్పటికే సోషల్ మీడియా వేదికలైన మేటా, ఎక్స్‌లను కోరిన కేంద్ర ప్రభుత్వం ఇటువంటి కార్యకలాపాల వెనుక ఉన్న వారిని గుర్తించే పనిలో పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News