Monday, March 10, 2025

త్రివేణి సంగంలో 40 కోట్లకు పైగా భక్తులు పుణ్య స్నానం ఆచరించారు

- Advertisement -
- Advertisement -

మహాకుంభ్ నగర్: మహాకుంభమేళాలో శుక్రవారం వరకు 40 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానం ఆచరించారని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. త్రివేణి సంగం(గంగ, యమున,సరస్వతి నదుల సంగమం)లో శుక్రవారం 48 లక్షల మంది భక్తులు పుణ్యస్నానం ఆచరించారు. కాగా మహాకుంభమేళా జనవరి 26న ముగియనున్నది. మకర సంక్రాంతి, మౌని అమావాస్య, బసంత్ పంచమి సందర్భంగా ‘అమృత స్నానాలు’ ముగిసినప్పటికీ భక్తులు ఇప్పటికీ పెద్ద సంఖ్యలో వస్తూనే ఉన్నారు. మౌని అమావాస్యనాడు అత్యధికంగా ఎనిమిది కోట్ల మంది భక్తులు పుణ్యస్నానం ఆచరించారని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఇక సంక్రాంతి నాడు 3.5 కోట్ల మంది భక్తులు, బసంత్ పంచమినాడు 2.7 కోట్ల మంది పుణ్యస్నానం ఆచరించారు.

ఇంకా జనవరి 30న రెండు కోట్లకు పైగా భక్తులు, పౌష్య పూర్ణిమ నాడు 1.7 కోట్ల మంది పవిత్ర నదీ స్నానం ఆచరించారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాజ్యసభ ఎంపీ సుధా మూర్తి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తదితర ప్రముఖులు పుణ్యస్నానం ఆచరించారు. వీరేకాక నటీనటులు హేమా మాలిని, అనుపమ్ ఖేర్, ఒలింపిక్ మెడలిస్ట్ సైనా నెహ్వాల్, కొరియోగ్రాఫర్ రెమె డిసౌజా తదితర ప్రముఖులు కూడా పుణ్యస్నానం ఆచరించారు. ఇదిలావుండగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ప్రయాగ్‌రాజ్ చేరుకుని పవిత్ర స్నానం ఆచరిస్తారని ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News