Sunday, January 19, 2025

500కు పైగా చిన్నారులు మృతి..

- Advertisement -
- Advertisement -

ఉక్రెయిన్‌: యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో ఇప్పటివరకు తొమ్మిది వేల మందికి పైగా అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ఐక్యరాజ్య సమితి తాజాగా వెల్లడించింది. మృతుల్లో 500 మంది చిన్నారులున్నట్లు  ఉక్రెయిన్‌లోని ఐరాస మానవ హక్కుల పర్యవేక్షణ మిషన్ (హెచ్‌ఆర్‌ఎంఎంయు) తెలిపింది. వాస్తవానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని తెలిపింది. యుద్ధంలో పౌర మరణాలను తీవ్రంగా ఖండించింది. 2022తో పోలిస్తే ఈ ఏడాది మృతుల సంఖ్య సగటు తక్కువగానే ఉన్నప్పటికీ మే, జూన్ నెలల్లో మళ్లీ పెరగడం ప్రారంభమైందని పేర్కొంది.

ఈ యుద్ధంలో ఇరు వైపులా వేలది మంది సౌనికులు చనిపోయారు. మృతుల సంఖ్యపై అటు రష్యా కానీ, ఇటు ఉక్రెయిన్ కానీ నిర్దిష్ట ప్రకటన చేయలేదు. అయితే జులై7 నాటికి 2.32 లక్షల మంది రష్యన్ సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ తెలిపింది. మరో వైపు 63 లక్షల మంది ఉక్రెయిన్లు శరణార్థులుగా మారారని ఐరాస అంచనా వేసింది.60 లక్షల మంది నిరాశ్రయులైనట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఉక్రెయిన్ భూభాగంలో దాదాపు 17 శాతం రష్యా ఆక్రమణలో ఉన్నట్లు అంచనా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News