Friday, December 20, 2024

తెలంగాణలో 608 నామినేషన్ల తిరస్కరణ….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల పరిశీలన ఘట్టం ముగిసింది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కలిపి 4798 మంది అభ్యర్థులు 5716 నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం నామినేషన్ల పరిశీలనలో 608 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నాగార్జునసాగర్‌లో జానారెడ్డి, హుజూరాబాద్‌లో ఈటల జమున నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. అత్యధికంగా 7 నియోజకవర్గాల్లో బిఎస్ పి అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణకు గురయ్యాయి. రేపటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News