- Advertisement -
ఐజ్వాల్: మిజోరం అసెంబ్లీ 40 సీట్లకు ఓటింగ్ నేడు ముగిసింది. మధ్యాహ్నం వరకు 69 శాతం మేరకు పోలింగ్ జరిగింది. అధికారంలో ఉన్న మిజో నేషనల్ ఫ్రంట్, ప్రతిపక్ష పార్టీ అయిన మిజోరం పీపుల్స్ మూవ్మెంట్ మొత్తం 40 సీట్లకు తమ తమ అభ్యర్థులను పోటీకి నిలిపాయి. కాగా బిజెపి 23 సీట్లకు, ఆమ్ ఆద్మీ పార్టీ నలుగురు అభ్యర్థులను పోటీకి నిలిపాయి. వీరే కాకుండా 27 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. మిజోరం ఎన్నికల్లో ప్రస్తుతం విదేశీయులు ఎన్నికల అంశంగా మారారు. మిజోరంలో ఓటింగ్ ఉదయం 7 గంటలకు మొదలయి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరుగనున్నది.
- Advertisement -