Friday, November 22, 2024

ప‌ల్లె ప్ర‌కృతి వ‌నం.. ప్ర‌శాంత‌త‌కు నిల‌యం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలోని ప్రతి పల్లె ఆదర్శంగా నిలువాలన్న లక్షంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నూతన సమగ్ర గ్రామీణ విధానాన్ని అవలంభిస్తోంది. ప్రధానంగా పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లు విరియాలనే లక్ష్యంగా ప్రభుత్వం పలు విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పల్లె ప్రకృతి వనాలను, బృహత్ పల్లె ప్రకృతి వనాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది. వీటికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 12,769 గ్రామాల్లో రూ. 67.45 కోట్ల వ్యయంతో 13,637 ఎకరాలలో విస్తీర్ణంలో 19,472 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం జరిగింది.

పల్లె ప్రకృతి వనాలలో ఓపెన్ జిమ్‌లు, వాకింగ్ ట్రాక్‌లు, పిల్లల కోసం అట స్థలాలు, పెద్దల సేద తీరడానికి వీలుగా ఏర్పాట్లు చేయబడుతున్నాయి. పల్లె ప్రకృతి వనాలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి ఆదారణ లభిస్తుండడంతో ప్రభుత్వం మరో ముందడుగు వేసి బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా 2,725 బృహత్ పల్లె ప్రకృతి వనాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కొక్క బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని 5 నుండి 10 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంగా పెట్టుకుంది.

అందులో భాగంగా ఇప్పటివరకు 2,339 స్థలాలను గుర్తించారు. వీటిలో 1,849 స్థలాలలో పనులు ప్రారంభించగా, 1,478 బృహత్ పల్లె ప్రకృతి వనాలు పూర్తయ్యాయి. ఇంకా 386 బృహత్ పల్లె ప్రకృతి వనాలకు స్థలాలను గుర్తించాల్సి ఉంది. త్వరలోనే స్థలాలను గుర్తింపు బృహత్ పల్లె ప్రకృతి వనాలను పూర్తి చేయడానికి ఇప్పటికే పంచాయతీరాజ్ కార్యచరణ ప్రణాళిక రూపొందించింది. పట్టణ ప్రాంతాల తరహాలో గ్రామాలల్లో కూడా పార్కులు, వాకింగ్ ట్రాక్ ఉండాలని లక్ష్యంతో అడవిని తలపించేలా బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని తలపెట్టింది. బృహత్ పల్లె ప్రకృతి వనాలల్లో తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు నాటుతున్నారు. ప్రతి మండలానికి సగటున ఐదు చొప్పున ఏర్పాటు చేస్తోంది. అందుకోసం దాదాపుగా రూ. 300 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. గ్రామీణ విద్యార్థులు, యువత, యువకులు, వృద్ధులు సేదతీరటానికి, కాలక్షేపంగా ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనికి తోడుగా వ్యాయయం కోసం జిమ్స్ ఏర్పాటు చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News