Friday, November 22, 2024

హైవే దారిలో మరిన్ని మొక్కలు పెంచాలి

- Advertisement -
- Advertisement -

తూప్రాన్: మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని జాతీయ రహదారి పొడువున ఇరువైపులా 19న చేపట్టే హరితహారం కార్యక్రమంలో మరిన్ని మొక్కలను పెంచేలా ప్లాన్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా మున్సిపల్ కమిషన్ మోహన్‌కు సూచించారు.హైవేదారిలో పలచగా ఉన్నాయని, చెట్ల మద్య ఏర్పడ్డ ఖాళీ స్థలాల్లో విరివిగా మొక్కలు నాటాలని చెప్పారు.

మంగళవారం ఆయన అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్‌తో కలిసి మనోహరాబాద్ మండల పరిధిలోని సనోఫి కంపెనీలో రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన తెలంగాణ పారిశ్రామిక ప్రగతికార్యక్రమానికి హాజరై తిరుగు ప్రయాణఃలో వారు తూప్రాన్ హైవేపై ఆగి ఎవెన్యూ ప్లాంటేషన్‌ను పరిశీలించారు. హైవేకు ఇరువైపులా మరిన్ని మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంచాల్సిన అవసరముందని తెలిపారు. కలెక్టర్, అదనపు కలెక్టర్ వెంట డిఆర్‌డిఓ శ్రీనివాస్, ఇంచార్జీ ఎంపిడిఓ రమేష్, మున్సిపల్ మేనేజర్ రఘువరన్, సిబ్బందిలున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News