Monday, December 23, 2024

జూపార్కులో మొదటి రోజు ఆహ్లాదంగా..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / రాజేంద్రనగర్: 2022 నూతన సంవత్సరం మొదటి రోజు వన్యప్రాణులు తిలకించేందుకు నగర ప్రజలు ఉత్సాహం చూపారు. కుటుంబ సమేతంగా ఆహ్లాదకర వాతావరణంలో గడపాలంటే గుర్తొచ్చే జూపార్కును సందర్శించేందుకు వేలాదిగా తరలి ఇచ్చారు. దీంతో గత లాక్‌డౌన్‌ల కాలం నుంచి జనం రద్దీ లేకుండా కనిపించిన నెహ్రూ జూపార్కు జనవరి ఫస్ట్ రోజు మాత్రం జనం కలను తిరిగి సంతరించుకుంది. ఒక్క శనివారం నాడే దాదాపు 28వేల మంది సందర్శకులు జూపార్కును చుట్టారు. దేశంలోనే ఉత్తమ జూపార్కుగా ఐఎస్‌ఒ గుర్తింపు పొందిన నగర జూకు సాధారణ రోజుల్లో సుమారుగా 5 వేల మంది సందర్శకులు వస్తుంటారు. నగరంతో పాటు తెలంగాణాలోని అన్ని జిల్లాల నుంచి, పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి సందర్శకులు సహజసిద్ధంగా ఉండే ఇక్కడి జంతు ప్రదర్శన శాలను సందర్శించడానికి మక్కువ చూపుతుంటారు.
జనంతో జంతువుల ఆనందహేళ
గత ఏడాదితో పాటు గడిచిన సంవత్సర కాలంలో జనం సరిగా రాక జంతువులు కూడా కొంత నిరుత్సాహంగా మారాయని చెప్పాలి. జూపార్కులోని కొన్ని రకాల జంతువులు, పక్షులు సందర్శకులు ఎక్కువగా తరలివచ్చే సమయాల్లో వారిని ఆకట్టుకునే ప్ర యత్నాలు విపరీతంగా చేస్తాయి. వాటిలో పిలిస్తే పలికే పక్షులు, జంతు సంరక్షకుల మాట వింటే ఎక్కడ ఉన్నా పరుగున వచ్చే పెద్దపులు, సింహాలు, మావటిల కోడ్ భాషలో ఏనుగులు జూపార్కు తరలివచ్చే వన్యప్రాణి ప్రేమికులను ఇట్టే ఆకట్టుకుంటాయి. సందర్శకుల రాక అధికంగా ఉండడంతో వైల్డ్‌లైప్ పాఠాలను వారికి ఒంటబట్టించే ప్రయత్నంలో ఇక్కడి జంతు సంరక్షులు ప్రత్యేక కార్యక్రమాల ద్వారా జనంతో పాటు జంతువులు ఆనంద హేళలో మునిగిపోతారు.
సందర్శకుల ఆరోగ్య పరిక్షణకు ప్రత్యేక చర్యలు
– క్యూరేటర్ ఎస్.రాజశేఖర్
జూపార్కును సందర్శించేందుకు తరలి వచ్చే సందర్శకుల ఆరోగ్య పరిరక్షణ కూడా తమకు ముఖ్యమేనని క్యూరేటర్ ఎస్. రాజశేఖర్ తెలిపారు. కరోనా, ఒమిక్రాన్ వైరస్‌లు జూపార్కు ధరి చేరకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ప్రధాన ప్రవేశ ద్వారం మొదలు బ్యాటరీ వాహనాలు, సఫారీ వాహనాలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. దాంతో పాటు మాస్క్ లేని వారిని లోకిని అనుమతించకపోవడంతో పాటు జూపార్కులోని వన్యప్రాణులను తిలకించే సమయాల్లో మాస్క్‌లు తొలగించే వారిని గుర్తించి చలాన్లు విధించడం జరుగుతుందని తెలిపారు. సందర్శకులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసే విధంగా మైక్ అనౌన్స్‌మెంట్ కొనసాగుతుందన్నారు. పూర్తి స్థాయిలో సందర్శకుల తనిఖీ అనంతరం లోనికి అనుమతించే విధంగా సెక్యూరిటీ విభాగానికి పనితీరును మరితం మెరుకు పరిచినట్లు ఆయన వివరించారు. అలాగే ప్రతి 30 నిముషాలకు ఒక సారి స్వీయ పర్యవేక్షణ, తనిఖీలు నిర్వహిస్తూ సిబ్బందితో పాటు సందర్శకుల గమనిసున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News