ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ బుధవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు భారత క్రికెట్ జట్టు ఇప్పటికే దుబాయ్‌కి చేరుకుంది. కానీ, టోర్నమెంట్ ఆరంభానికి ముందు భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది. తన తండ్రి హఠాన్మరణంతో జట్టు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ సౌతాఫ్రికాకి వెళ్లిపోయారు. మళ్లీ ఆయన జట్టుతో ఎప్పుడు జతకడతారో క్లారిటీ లేదు.
గతేడాది డిసెంబర్‌లో మోర్కెల్ భారత జట్టు పేస్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన వచ్చిన తర్వాత జట్టు పేస్ బౌలింగ్ మరింత బలపడింది. ఆయన కోచింగ్‌లో బుమ్రా బార్డర్-గవాస్కర్ ట్రోఫీలో, ఇటీవల జరిగిన ఇంగ్లండ్ సిరీస్‌లో హర్షిత్ రాణా అద్భుతంగా రాణించారు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు మోర్కెల్ జట్టుకు దూరం కావడం ప్రధాన సమస్యగానే చెప్పుకోవాలి.
ఇక ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్‌లో నిర్వహిస్తున్న నేపథ్యంలో భారత్ ఆ దేశంలో పర్యటించేది లేదని తేల్చి చెప్పింది. దీనిపై ఎన్నిసార్లు చర్చలు జరిపిన బిసిసిఐ వెనకడుగు వేయలేదు. దీంతో భారత జట్టు ఆడే మ్యాచ్‌లు అన్ని దుబాయ్‌లో నిర్వహిస్తామని ఐసిసి తెలిపింది. ఫిబ్రవరి 20న భారత్ తన తొలి మ్యాచ్ బంగ్లాదేశ్‌తో ఆడనుంది. అనంతరం ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో, మార్చి 2న న్యూజిలాండ్‌తో తలపడనుంది.