- Advertisement -
అమరావతి: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎపి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎల్లుండి నుంచి పగటి పూట కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నిబంధనలు ఎల్లుండి మధ్యాహ్నం 12తర్వాత నుంచి అమలులోకి రానున్నాయి. ఎపిలో 2వారాలపాటు ఈ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకే దుకాణాలకు అనుమతిచ్చారు. కర్ఫ్యూ నుంచి అత్యవసర సేవలకు మినహయింపు ఇచ్చారు. కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని సిఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఎపిలో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
Morning Curfew in Andhra Pradesh for 14 days
- Advertisement -