Monday, December 23, 2024

ఈనెల 20వ తేదీన ఓయూలో మార్నింగ్ వాక్: విసి రవీందర్‌ యాదవ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం పలు కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ నెల 20వ తేదీ ఉదయం తెలంగాణ మార్నింగ్ వాక్ కార్యక్రమం చేపట్టనున్నట్లు ఉపకులపతి ప్రొఫెసర్ దండెబోయిన రవీందర్‌ యాదవ్ తెలిపారు. ఆర్ట్ కళాశాల, ఇంజినీరింగ్, సైన్స్ కళాశాలల నుంచి వేర్వేరుగా మార్నింగ్ వాక్ ర్యాలీలు ప్రారంభమై ఠాగూర్ ఆడిటోరియం చేరుకుంటాయి. అక్కడ నూతనంగా నిర్మించిన డాక్టర్ నాగయ్య ఓపెన్ ఎయిర్ థియేటర్‌ను ఉదయం 9 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ సంద్భంగా వ్యాయామ విద్యా విభాగానికి చెందిన విద్యార్థులు పిరమిడ్ విన్యాసాలు చేయనున్నారు. ఈ నెల 20వ తేదీన విద్యా నైపుణ్యాభివృద్ధి దినోత్సవం పురస్కరించుకుని ఈ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆయా కళాశాలల్లో ప్రిన్సిపల్స్ నేతృత్వంలో ప్రత్యేకంగా ఉపన్యాస, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విజేతలకు డాక్టర్ నాగయ్య ఓపెన్ ఎయిర్ థియేటర్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో బహుమతుల ప్రధానం జరగనుంది. ఆయా కళాశాలల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News