ఇస్లామాబాద్: మొరాకో స్థాయిలో భూకంపం త్వరలో పాకిస్తాన్‌లో సంభవించనున్నట్లు సోషల్ మీడియాలో కనిపించిన ఒక పోస్టు వైరల్ కావడంతోపాటు అధికారులు సైతం దాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారని ది డాన్ పత్రిక తెలిపింది. అయితే భూకంపాల రాకను అంచనా వేయడం అసాధ్యమని శాస్త్రవేత్తలు వాదిస్తున్నప్పటికీ పాకిస్తాన్‌లో ఈ అంచనాల పట్ల అధికారులు తీవ్రంగా యోచిస్తున్నట్లు ఇరానియన్ మీడియా చెబుతోంది.
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌కు చెందిన చమన్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించనున్నట్లు నెదర్లాండ్స్‌కు చెందిన సోలార్ సిస్టమ్ జియోమెట్రి సర్వే(ఎస్‌ఎస్‌జిఎస్) అంచనా వేసినట్లు ది డాన్ పత్రిక పేర్కొంది. మొదట ఈ అంచనాలు అక్స్(పూర్వ ట్విట్టర్)లో వెలువడగా ఆ తర్వాత ఎస్‌ఎస్‌జిఎస్‌కు చెందిన భూకంప పరిశోధనావేత్త, గతంలో అనేకసార్లు భూకంప అంచనాలు విజయవంతంగా ముందే చెప్పిన ఫ్రాంక్ హోగర్‌బీట్స్ పునరుద్ఘాటించడంతో ఆ పోస్టుపై పాకిస్తాన్‌లో ఆసక్తి ఏర్పడింది.
పాకిస్తాన్ సమీపంలోని ప్రాంతాలతోపాటు అనేక ప్రాంతాలలో వాతావరణ మార్పులను సెప్టెంబర్ 30న రికార్డు చేశామని డచ్ పరిశోధకుడు ఫ్రాంక్ మోగర్‌బీట్స్ తన ఎక్స్ పోస్టులో తెలిపాడు. ఈ అంచనాలు నిజమేనని, రానున్న భారీ భూప్రకంపనలకు(మొరాకో తరహాలో) ఇది సంకేతమని ఆయన తెలిపాడు. అయితే ఇది కచ్ఛితంగా జరుగుతుందని మాత్రం తాము చెప్పలేమని ఆయన పేర్కొన్నారు.
On 30 September we recorded atmospheric fluctuations that included parts of and near Pakistan. This is correct. It can be an indicator of an upcoming stronger tremor (as was the case with Morocco). But we cannot say with certainty that it will happen. https://t.co/B6MtclMOpe
— Frank Hoogerbeets (@hogrbe) October 2, 2023
రానున్న 48 గంటల్లో భారీ భూకంపం పాకిస్తాన్‌లో సంభవించనున్నదని, దీని తీవ్రత రికస్టర్ స్కేల్‌పై ఆరు లేదా అంతకన్నా ఎక్కువే ఉండవచ్చని ఆయన అంచనా వేశారు. ఇది చమన్ ప్రాంతంలో సంభవించవచ్చని కూడా ఆయన తెలిపారు. అయితే సెప్టెంబర్ 29న ఆయన ఈ ప్రకటన చేయగా ఇప్పటికే మూడు రోజులు గడిచిపోయాయి.
కాగా..హూగర్‌బీట్స్ గతంలో భూకంపం గురించి చెప్పిన అంచనాలు నిజమయ్యాయి. టర్కీ, సిరియాలో ఫిబ్రవరిలో భారీ భూకంపం వస్తుందని ఆయన అంచనా వేయగా 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపానికి 50,000 మందికి పైగా ఆనెలలో మరణించారు. 2023 జనవరి 30న పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్, చైనాలో బూమిపొరలలో కదలికలు పెరిగాయని ఆయన చెప్పగా ఫిబ్రవరి 7న పాకిస్తాన్‌లో భూకంపం సంభవించి 9 మంది ప్రాణాలు కోల్పోయారు.