Tuesday, April 15, 2025

త్వరలోనే ‘హరి హర వీరమల్లు’ సెట్స్‌లోకి

- Advertisement -
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘హరి హర వీరమల్లు’. ఈ చిత్రం మే 9, 2025న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. అయితే పవన్ కళ్యాణ్ ఇటీవలే తన కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తన పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడటంతో సింగపూర్‌కు వెళ్లారు. చికిత్స సమయంలో పవన్ కళ్యాణ్ తన కొడుకు పక్కనే ఉన్నారు. అదృష్టవశాత్తూ, మార్క్ శంకర్ చాలా త్వరగా కోలుకుంటున్నాడు. తన కొడుకుతో కలిసి శనివారం రాత్రి హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు పవన్. దీంతో ఫ్యాన్స్ దృష్టి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హరి హర వీర మల్లు చిత్రం వైపు పడింది.

పవన్‌కి ఇంకా 3 నుంచి 5 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. కాబట్టి పవన్ త్వరలోనే సెట్స్‌కి తిరిగి వచ్చి తన భాగాన్ని పూర్తి చేస్తారని తెలుస్తోంది. విడుదల తేదీ కూడా మే 9, 2025. కాబట్టి, ప్రమోషనల్ కంటెంట్‌ను విడుదల చేయాలని చిత్రబృందాన్ని ఫ్యాన్స్ అభ్యర్థిస్తున్నారు. కాగా డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్‌తో పాటు బాబీ డియోల్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News