Thursday, September 19, 2024

అక్టోబర్ 8న ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్’ వచ్చేస్తున్నాడు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అక్కినేని కుర్రహీరో అఖిల్, అందాల భామ పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్’. జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా బొమ్మరిల్లు భాస్కర్‌ ఈ సినిమాను రూపొందించారు. అక్టోబర్ 8న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ తాజాగా సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ కు మంచి స్పందన వచ్చింది. ఇప్పటివరకు సరైన విజయం లేని అఖిల్ ఈ మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నాడు.

 

Most Eligible Bachelor to release on Oct 8

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News