- Advertisement -
న్యూఢిల్లీ : దేశంలోని ప్రముఖ విలేజ్ కామర్స్ నెట్‌వర్క్ అయిన 1 బ్రిడ్జ్ గ్రామీణ భారతదేశంలో వినియోగదారుల ఆకాంక్షలు, వినియోగ ధోరణులపై సర్వే నిర్వహించింది. కర్నాటక, తెలంగాణ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లోని 100 గ్రామాల్లో ఈ అధ్యయనం నిర్వహించారు. గ్రామాల్లో స్మార్ట్‌ఫోన్‌లు, మొబైల్ ఉపకరణాలు, గృహోపకరణాలు, వంటగది ఉపకరణాల కొనుగోలు పట్ల ఆసక్తి ఎక్కువగా ఉందని సర్వేలో వెల్లడైంది. 50 శాతం మంది గృహోపకరణాలు, 37 శాతం ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు, 25 శాతం మంది వంటగది ఉపకరణాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని నివేదిక తెలిపింది. గ్రామాల్లో ఆన్‌లైన్ కొనుగోళ్ల పట్ల అంతగా ఆసక్తి లేదని, దీనికి కారణం సరైన సమాచారం లేకపోవడం, మోసాలు, డెలివరీ సమస్యలేనని సర్వే తెలిపింది.
- Advertisement -