Friday, December 20, 2024

చాట్ జిపిటితో ఈ ఉద్యోగాలకు చాలా ముప్పు

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : మైక్రోసాఫ్ట్‌కు చెందిన చాట్ జిపిటి ఎంతటి సంచలనం సృష్టిస్తుందో అందరికీ తెలిసిందే. తాజాగా జిపిటి4 కూడా విడుదలైంది. ఈ చాట్ జిపిటి(జనరేటివ్ ప్రి టైన్డ్ ట్రాన్స్‌ఫార్మర్) వల్ల అనేక ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని ఇప్పటికే అనేక మంది విశ్లేషకులు చెప్పారు. ఎటువంటి జాబ్‌లను ముప్పు ఉంటుందో, ఆ జాబితాను చాట్ జిపిటిని తయారు చేసిన ఓపెన్ ఎఐ, పెన్సిల్వేనియా యూనివర్సిటీ విశ్లేషకులు విడుదల చేశారు. జిపిటి, దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్ వల్ల అత్యధికంగా ప్రమాదం ఉండే ఉద్యోగాల్లో కవులు, వెబ్ డిజిటల్ డిజైనర్లు, గణిత పండితులు, పన్నును లెక్కించేవారు, బ్లాక్‌చెయిన్ ఇంజినీర్లు, రచయితలు ఉన్నారు.

అధిక ఆదాయ ఉద్యోగాలు ఎక్కువగా ఎఐ ఆధారిత చాట్‌బాట్‌ల వల్ల ప్రమాదం ఎదుర్కొంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఓపెన్ ఎఐ వెబ్‌సైట్ ప్రకారం, జిపిటి మోడల్‌లు, సంబంధిత సాంకేతికతల వల్ల అమెరికా శ్రామిక శక్తిలో దాదాపు 80 శాతం మందికి గాను పనిలో కనీసం 10 శాతం వరకు ప్రభావితమవుతారు. దాదాపు 19 శాతం మంది కార్మికులు తమ పనుల్లో కనీసం 50 శాతం ప్రభావితం కావచ్చు. ఈ ప్రభావం అన్ని వేతన స్థాయిలను విస్తరిస్తుందని, అధిక- ఆదాయ ఉద్యోగాలు ఎక్కువ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని పరిశోధనలో వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News